బీకేఐ ఉగ్రవాది అరెస్ట్​

BKI terrorist arrested in UP

Mar 6, 2025 - 14:52
Mar 6, 2025 - 14:53
 0
బీకేఐ ఉగ్రవాది అరెస్ట్​

కుంభమేళాపై దాడికి యత్నం
వివరాలు వెల్లడించిన డీజీపీ

లక్నో: మహాకుంభ్​ మేళాలో దాడికి పథకం రచించిన ఉగ్రవాది లాజర్​ మాసిహ్​ ను అరెస్టు చేశామని, ఇతను బీకేఐ ఉగ్రవాది యూపీ డీజీపీ ప్రశాంత్​ కుమార్​ చెప్పారు. గురువారం ఈ ఉగ్రవాది అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. లాజర్​ బబ్బర్​ ఖల్సా ఇంటర్నేషనల్​ ఉగ్రవాది అని చెప్పారు. ఇతను పంజాబ్​ అమృత్​ సర్​ రాందాస్​ కుర్లియన్​ గ్రామంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఇతనికి పాక్​ ఐఎస్​ ఐతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారా పలు పేలుడు పదార్థాలు, ఆయుధాలు అందుకున్నాడని చెప్పారు. మేళాలో దాడి కోసం ఐఎస్​ ఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించామన్నారు. మహాకుంభ మేళా సందర్భంగా లాజర్​ యూపీలోని కౌశాంబి, లక్నో, కాన్పూర్​ లలో బస చేసినట్లు గుర్తించామన్నారు. తమకు అల్లర్లపై సమాచారం అందడంతో బందోబస్తు, రోజువారీ చెకింగ్​ లతో పారిపోయాడన్నారు. ఇతను పోర్చుగల్​ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పట్టుకున్నారని చెప్పారు. ఇతన్ని విచారించి కీలక విషయాలను రాబట్టామన్నారు.