తొక్కిసలాటలో కుట్ర కోణం బీజేపీ ఎంపీ శంకర్ ప్రసాద్
BJP MP Shankar Prasad is the conspiracy angle in the stampede

నా తెలంగాణ, న్యూఢిల్లీ: మహాకుంభ మేళాలో తొక్కిసలాట ఘటనలో ఏదో కుట్ర కోణం ఉందని, దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. 35 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారన్నారు. విచారణలో కుట్ర కోణాలు వెలుగుచూడనున్నట్లు తెలుస్తుందన్నారు. కుంభమేళా పేరు వింటేనే విపక్షాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. సనాతన అవమానాన్ని భారతదేశం ఎన్నటికీ సహించబోదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.