దేశవ్యాప్తంగా ఒకే టోల్​ కు ప్రభుత్వం సిద్ధం

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ

Feb 3, 2025 - 17:53
 0
దేశవ్యాప్తంగా ఒకే టోల్​ కు ప్రభుత్వం సిద్ధం

నా తెలంగాణ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే టోల్​ విధానానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని కేంద్ర రోడ్డురవాణా, రహాదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏకరూప టోల్​ విధానంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భారతదేశ హైవేలో మౌలిక సదుపాయాల కల్పన అమెరికాతో సరిపోలుతున్నాయని తెలిపారు. సోషల్​ మాధ్యమగా వచ్చ ఫిర్యాదులను కూడా సీరియస్ గా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టోల్​ చార్జీలు పెరగడంతో ప్రయాణికుల్లో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. 2023–24లో టోల్​ వసూల్లు రూ. 64,809.86 కోట్లకు చేరుకుందని, అంతకుముందు సంవత్సరం కంటే 35 శాతం ఎక్కువన్నారు. 2019–20లో రూ. 27,503 టోల్​ వసూళ్లు ఉన్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏడువేల కి.మీ. మేర హైవేలు నిర్మించారని గడ్కరీ తెలిపారు.