సైఫ్ పై దాడి మరో నిందితుడి అరెస్ట్
Attack on Saif, another suspect arrested
రంగంలోకి 35 బృందాలు
కరీనా వాంగ్మూలం నమోదు
మెరుగుపడుతున్న సైఫ్ ఆరోగ్యం
సోషల్ మాధ్యమంగా చిలువలు పలువలుగా వార్తలు
నమ్మొద్దంటున్న పోలీసులు
ముంబాయి: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్న నిందితుడు షాహీద్ కు ఈ దాడితో సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో శనివారం సీసీ ఫుటేజీల ద్వారా ఆ ప్రాంతంలో తచ్చాడిన మరో వ్యక్తిని పోలీసులు మధ్య ప్రదేశ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిని విచారిస్తున్నారు. దాడి కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు ముంబాయి పోలీసులు ఇప్పటికే 35 బృందాలను రంగంలోకి దింపారు. నిందితుడు ముంబాయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద కనిపించాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
మరోవైపు కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. నిందితుడు అక్కడ ఉన్న నగలను వదిలేశాడని, సైఫ్ వెళ్లకుంటే పిల్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేదని, తాను చాలా భయపడినట్లు కరీనా పోలీసుల వాంగ్మూలంలో పేర్కొంది. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జీ చేస్తామని ప్రకటించారు.
కాగా సైఫ్ పై దాడి అండర్ వరల్డ్, కుట్రకోణమని, ఇంట్లో పనివారి పనేనని, శత్రువుల పని అని సోషల్ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం వీటన్నింటినీ కొట్టి పడేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరమే అన్ని విషయాలను స్పష్టం చేయగలమని తెలిపారు. అంతవరకూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నిజమని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.