ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఎంపీసీ సమావేశం
MPC meeting chaired by RBI Governor
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్బీఐ ఎంపీసీ (ద్రవ్య పరపతి సంఘం– మోనిటరింగ్ పాలసీ కమిటీ) సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రకటనలు, రెపోరేటు తగ్గింపునకు అనుకూల నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో ద్రవ్యోల్బణం గణాంకాలు 4.5 శాతం ఉండగా, ఫిబ్రవరిలో ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రటులో 0.25శాతం తగ్గింపు అవకాశం ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లో పాలసీ రేటును 0.75 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. బడ్జెట్ ద్రవ్య విధానానికి అనుకూలంగానే ఉందని భావిస్తున్నారు. ఒకవేళ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎక్కువగా బలహీనపడితే పాలసీ రేటు తగ్గింపు ఆలస్యం కావచ్చని ఇక్రా చీఫ్ అదితి నాయర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.