ఢిల్లీ పీఠం కమలానిదే

ఎగ్జిట్​ పోల్స్​ లో స్పష్టమైన మెజార్టీ

Feb 5, 2025 - 19:06
 0
ఢిల్లీ పీఠం కమలానిదే

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఢిల్లీ ఎన్నికల ఘట్టం పరిపూర్ణమైంది. వివిధ ఎగ్జిట్​ పోల్స్​ లో బీజేపీ – ఆప్​ మధ్య వార్​ కొనసాగుతున్నట్లు ఎన్నికల్లో కనిపించినా అన్ని ఎగ్జిట్​ పోల్స్​ లో మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కుతుంది. 3 నుంచి ఏడు సీట్ల తేడాతో బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అధికారానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ బీజేపీకి దక్కనుంది. అదే సమయంలో ఆప్​ మెజార్టీ స్థానాలకు 3 నుంచి 8 స్థానాల దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్​ పార్టీ ఎగ్జిట్​ పోల్స్​ లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ విషయాన్ని ‘నా తెలంగాణ దిన పత్రిక– వెబ్​ సైట్​’ మాధ్యమంగా కూడా పలుమార్లు విశ్లేషిస్తూ కథనాలను కూడా ప్రసారం చేసింది. ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్​ నామ్​ కే వాస్తేగానే పోటీలో ఉందని వెల్లడించింది. 

ఎగ్జిట్​ పోల్స్​ 
మాట్రిజ్​: బీజేపీ–35–40 స్థానాలు 46 శాతం, ఆప్​ 32–37 స్థానాలు 44 శాతం, కాంగ్రెస్​ 0–1 స్థానాలు 8 శాతం, ఇతరులు 2 స్థానాలు 2 శాతం.

జేవీసీ: బీజేపీ–39–45, ఆప్ 22–31, కాంగ్రెస్​ 0–2,  ఇతరులు 1స్థానం.

చాణక్య స్ట్రాటజీస్​: బీజేపీ – 39–44, ఆప్​ 25–28, కాంగ్రెస్​ 2–3, ఇతరులు 0.

పీపుల్స్​ పల్స్​: బీజేపీ 51–60, ఆప్​ 10–19, కాంగ్రెస్​ 0, ఇతరులు 0.

పీపుల్స్​ ఇన్​ సైయిట్​: బీజేపీ 40–44, ఆప్​ 25–29, కాంగ్రెస్​ 1, ఇతరులు 0.

పోల్​ డైరీ: బీజేపీ 42–50, ఆప్​ 18–25, కాంగ్రెస్​ 2, ఇతరులు 0

పీ–మార్క్​: బీజేపీ 39–49, ఆప్​ 21–31, కాంగ్రెస్​ 1, ఇతరులు 0