షియా ఆగాఖాన్ కన్నుమూత
ప్రధాని మోదీ సంతాపం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: షియా మతనాయకుడు, బిలియనీర్ ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ ఆగా ఖాన్ (88) కన్ను మూశారు. పోర్చుగల్ లో మంగళవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు బుధవారం ఆగా ఖాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఈయన్ను షియా సమాజం మహమ్మద్ ప్రవక్త వారసుడిగా పరిగణిస్తుంది. ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా ఈయన అనేక సేవా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా ఈయన అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని లిస్బన్ లోని ఆయన కుటుంబ సభ్యులు మతపెద్దల సమక్షంలో ప్రకటించనున్నారు. ఆగాఖాన్ మహమ్మద్ ప్రవక్తకు 49వ ఇమామ్ గా పరిగణిస్తారు.
ప్రపంచంలోని పేద, అగణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు మానవ, ఆర్థిక వనరులను ఒకచోటుకు చేర్చేందుకు 1967లో ఆగాఖాన్ ఫౌండేషన ను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 18 దేశాలలో పనిచేస్తూ సేవలందిస్తుంది. ఆగాఖాన్ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం..
హిస్ హైనెస్ ప్రిన్స్ కరీం ఆగాఖాన్ 4 మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాన్ని సేవకు, ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దార్శనికుడు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాలలో ఆమె చేసిన కృషి ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయనతో నా సంభాషణలను నేను ఎల్లప్పుడూ విలువైనవిగా భావిస్తాను. ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అనుచరులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి.