భారత్ వైపు జపాన్ సంస్థల చూపు
చైనా ఆర్థికానికి గండీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ ను జపాన్ సంస్థలు మరో పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశంగా చూస్తున్నాయి. దీంతో చైనా వ్యాపారానికి భారీ ఎత్తున గండిపడనుంది. కరోనా కష్టకాలం తరువాత భారత్ ను పశ్చిమాసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో వృద్ధికి ఆస్కారం ఉన్న దేశమని జపాన్ కు చెందిన సంస్థలు విశ్వసిస్తున్నాయి. చైనా అవలంభిస్తున్న వన్ ప్లస్ విధానం కఠినంగా ఉండడం కూడా చైనాలోని జపాన్ సంస్థలు భారత్ వైపు మళ్లేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఇప్పటికే డెలాయిట్ సంస్థ చైనా నుంచి వెనక్కి వెళ్లాలని, భారత్ లో తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కాస్త చైనా ఆర్థిక వ్యవస్థకు ఆశనిపాతంలా నిలవనుంది. మరోవైపు దేశీయంగానే మైక్రో చిప్ లు తయారవుతుండడం కూడా సంస్థలు భారత్ వైపు మొగ్గు చూపేందుకు మరో కారణంగా నిలుస్తుంది. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, అరబ్ దేశాల్లో భారత్ లో తయారు చేస్తున్న మైక్రో చిప్స్, సెమీ కండక్టర్స్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్ రంగంలో ఇక్కడ అడుగు పెడితే ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో ముఖ్యం జపాన్ సంస్థలున్నాయి. ఇందుకు అక్కడి ప్రభుత్వం కూడా భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండడంతో కార్యకలాపాల విస్తరణలో ఆటుపోట్లు తలెత్తకుండా ఉండనుంది. ఈ పరిణామాలు కాస్త చైనాకు మింగుడుపడనివిగా నిలవనున్నాయి.
........