బంగ్లా విద్యార్థి సంఘాలతో కొత్తపార్టీ
పాక్, చైనాలతో యూనస్ కుమ్మక్కు తర్వాత నిర్ణయం

ఢాకా: బంగ్లాదేశ్ లో మరోమారు తిరుగుబాటు మొదలైంది. ఈసారి యూనస్ నేతృత్వంలోని విద్యార్థి సంఘాలు పార్టీని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. షేక్ హసీనా రాజీనామా అనంతరం అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ ఆర్థిక స్థితులూ మరింత దిగజారాయి. దీంతో ఇప్పటికే యూనస్ పై ఎన్నికలనునిర్వహించాలనే అంతర్జాతీయ ఒత్తిళ్లున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే పాక్, చైనాలతో కూడా యూనస్ సీక్రెట్ గా ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరోమారు షేక్ హసీనా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదని భావించి యూనస్ ఈ కొత్త నాటకానికి తెరతీశారు. ఉగ్రనాయకులుగా ముద్రపడ్డ వారితో కొత్తపార్టీ ప్రయత్నాలకు తెరతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా పెట్టబోయే పార్టీకి 64 జిల్లాల ప్రజలు, వివిధ పార్టీ బడా నాయకులు కూడా పాల్గొంటారని ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో పూర్తిగా భారత వ్యతిరేకులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ విషయాలను భారత్ ఓ కంట కనిపెడుతూనే ఉంది. యూనస్ ప్రభుత్వానికి క్రమేణా వ్యతిరేకత ఉండడంతో యూనస్ పాక్, చైనాలతో కలిసి ఈ కొత్త కుట్రకు తెరతీశారు.