అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలి

Illegal immigration should be clamped down on

Feb 28, 2025 - 18:10
 0
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలి

ఢిల్లీ పోలీసులకు అమిత్​ షా ఆదేశం
సీఎం గుప్తా,ఉన్నతాధికారులతో సమావేశం
మాన్సూన్​ యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేయాలి
2020 అల్లర్ల కేసులో ప్రత్యేక న్యాయవాదులను నియమించాలి
ట్రాఫిక్​ సమస్యల పరిష్కారంపై నివేదిక అందించాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి సీఎం రేఖాగుప్తా, ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలన్నారు. పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ లు నిర్వహించి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో మాన్సూన్​ యాక్షన్​ ప్లాన్​, బంగ్లాదేశ్​, రోహింగ్యా అక్రమ వలసదారులు వారికి సహకరిస్తున్న నెట్​ వర్క్​ పై ఆరా తీశారు. అక్రమంగా వస్తున్న వారిని లోపలకు ఎవరు తీసుకొస్తున్నారు? వారికి డాక్యుమెంట్లు ఎలా రూపొందిస్తున్నారు తదితర నెట్​ వర్క్​ లను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాలు జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నందున సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల భద్రతా ఏజెన్సీలతో కలిసి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో రానున్న వర్షాకాలానికి ముందే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలన్నారు. 2020 అల్లర్ల కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రత్యేక న్యాయవాదులను నియమించాలని కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోలీస్​ స్టేషన్లలో పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని వాటికి సత్వర పరిష్​కారం చూపాలన్నారు. అలాగే ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్​ జామ్​ సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.