బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం 61 మంది మృతి
విచారణం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డా సిల్వా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు

బ్రెసిలియ: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 61 మంది మృతి చెందారు. సావోపాలోలోని విన్హెడో నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వోయిపాస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయం గౌరుల్‌హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో 57 మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై బ్రెజిల్ ఏవియేషన్ విచారణ చేపట్టింది. విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియ సామాజిక, మీడియా మాధ్యమాల్లో కనిపిస్తుంది. విమానం గాల్లో కొద్దిసేపు చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా 17వేల అడుగుల ఎత్తు నుంచి కండోమినియం కాంప్లెక్స్ లోని ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఒక ఇళ్లు కూడా దెబ్బతిందని, పెద్ద ఎత్తున విమానంలో నుంచి మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా భారీగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ప్రమాదం జరిగిన వెంనే ఏడు అగ్నిమాపక బృందాలు, ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఎవియేషన్ అధికారులు ప్రమాదస్థలిని పరిశీలించి కారణాలను వెతికే పనిలో పడ్డారు.
కాగా ఈ విమానంలో మొత్తం 58మంది ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ ప్రయాణ సమయం ముగిశాక ఒక వ్యక్తి రావడంతో అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో 57మంది ప్రయాణికులు, 4 సిబ్బంది విమానంలో ప్రయాణించి ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందారు.