ఏప్రిల్ 17న నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రారంభం
Opening of Navi Mumbai Airport on April 17

ముంబాయి: నవీ ముంబాయిలో నిర్మించిన నూతన విమాశ్రయం ఏప్రిల్ 17న ప్రారంభించనున్నారు. గురువారం ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. మే నుంచి విమానాశ్రయం ద్వారా విమాన సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. డైరెక్టరేట జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ), ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) బృందాలు విమానాశ్రయ ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. మేలో విమానా సేవలు ప్రారంభం అయినా, వచ్చే ఏడాది జూలై నాటికి అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. ఈ విమానం ద్వారా ప్రతీఏటా రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనున్నట్లు తెలిపారు. తొలి ఆరు నెలల్లోనే కోటిమంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
కాగా మూడు దశల్లో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రూ. 17వేల కోట్లు కేటాయించారు. తొలిదశలో రూ. 6వేల కోట్లు, రెండో దశలో 3,420 కోట్లు, మూడో దశను 2032 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించుకున్నారు. ప్రస్తుతానికి మొదటి టెర్మినల్ పై ఇటీవలే విమానాన్ని విజయవంతంగా ట్రయల్ రన్ కూడా సక్సెస్ చేశారు. రెండో టెర్మినల్ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుకు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను ఖాళీ చేయించారు. 3500 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద రూ. 520 కోట్లను అందించారు.