ఖర్జూరంలో 172 గ్రాముల బంగారం!

ఢిల్లీ ఐజిఐ ఎయిర్​ పోర్ట్​ లో స్వాధీనం

Feb 27, 2025 - 15:26
 0
ఖర్జూరంలో 172 గ్రాముల బంగారం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో 172 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తున్న 56 ఏళ్ల వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక గొలుసు, బంగారం ముక్కలు ఉన్నాయన్నారు. ఈ వ్యక్తి బంగారాన్ని దాచిన తీరు చూసి ఆశ్చర్యం కలిగించిందన్నారు. లగేజీని ఎక్స్​ రే, స్కానింగ్​ చేయగా అందులో బంగారం ఉందని గుర్తించామన్నారు. కానీ బ్యాగులో ఏమి లేకపోవడంతో మరోమారు బ్యాగును క్షుణ్ణంగా మెటల్​ డిటెక్టర్​ తో తనికీ చేస్తుండగా తినుపదార్థాల్లో ఏదో ఉందని గుర్తించామన్నారు. ఖర్జూరంలో బంగారాన్ని దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు.