ఉదయం గరం.. సాయంత్రం నరం!

In the morning, the nerves.. in the evening!

Mar 1, 2025 - 19:00
 0
ఉదయం గరం.. సాయంత్రం నరం!

ట్రంప్​ కు జెలెన్స్కీ కృతజ్ఞతలు
స్వరం మార్చిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు

లండన్​: ట్రంప్​ తో శనివారం ఉదయం వాడీ వేడీ (గరం గరం) చర్చల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు కాస్త సాయంత్రానికి లండన్​ చేరుకొని చల్ల (నరం) బడ్డారు. లండన్​ చేరుకోగానే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశానికి అమెరికా మద్ధతుపై అభినందనలు తెలుపుతూ ట్రంప్​ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ట్రంప్​ తో చర్చల సందర్భంగా పలు అంశాలపై జెలెన్స్కీ విబేధిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. అనంతరం సమావేశం అర్థంతరంగా ముగిసింది. మీడియా ముందు జెలెన్స్కీ, ట్రంప్​, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్​ కస్సుబుస్సులాడుకున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 30 ఈయూ దేశాలు కూడా జెలెన్స్కీకి మద్ధతునిచ్చాయి. ఇందుకు గాను ఆయన ఆ దేశాలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఏమైందో ఏమో తెలియదు గానీ సాయంత్రం లండన్​ వచ్చేసరికి పూర్తి స్వరం మారిపోయింది. దీంతో మద్ధతిచ్చిన దేశాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి.