ప్రజల వద్దే రూ. 2000 నోట్లు రూ. 6,471 కోట్లు!
People have Rs. 2000 notes of Rs. 6,471 crores!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇంకా ప్రజల వద్దే రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉన్నాయని ఆర్భీఐ శనివారం డేటాను వెల్లడించింది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు 2023 అక్టోబర్ 7 అన్ని బ్యాంకు శాఖలలో అవకాశం ఇచ్చింది. రూ. 3.56 లక్షల కోట్లలో 2025 ఫిబ్రవరి 28 నాటికి రూ. 2వేల నోట్లు రూ. 6,471 కోట్లుగా ఉందని ప్రకటించింది. ఇప్పటికీ నోట్ల మార్పిడి సౌకర్యం రిజర్వ్ బ్యాంకు 19 శాఖల్లో ఉన్నట్లు తెలిపింది. 98.18 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది. అంతకుముందు ఆర్బీఐ ప్రకటించిన నివేదికలో రూ. 2 వేల నోట్లు రూ. 6,577 కోట్లుగా ప్రజల వద్దే ఉన్నాయి. రూ. 106 కోట్లు మాత్రమే బ్యాంకుకు వచ్చాయి.