అఖ్నూర్ దాడి ప్రాణనష్టం అవాస్తవం
The loss of life in the Akhnoor attack is unreal

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అఖ్నూర్ లో భద్రతా దళాల వాహనంపై జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగిందనే వార్తల్లో నిజం లేదని అధికారులు గురువారం ప్రకటించారు. ఇవన్నీ ఫేక్ వార్తలే అన్నారు. ఉగ్రదాడి ఫలించలేదని, భద్రతా దళాలూ వెంటనే అప్రమత్తం కావడంతో వారు తప్పించుకున్నారని అన్నారు. ప్రాణనష్టంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సైనికులంతా సురక్షితంగానే బయటపడ్డారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. కాల్పులు జరిగిన వెంటనే జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ఉగ్రవాదులు పారిపోయారని, వారి కోసం సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. సరిహద్దుల వెంట ఉగ్రచొరబాట్లను అడ్డుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే పూంచ్ సెక్టార్ సరిహద్దు నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురిని మట్టుబెట్టామని చెప్పారు.