చత్తీస్​ గఢ్​ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్​ కౌంటర్​ 16 మంది నక్సల్స్​ మృతి

చత్తీస్​ గఢ్​ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్​ కౌంటర్​ 16 మంది నక్సల్స్​ మృతి

Jan 21, 2025 - 12:44
Jan 21, 2025 - 13:18
 0
చత్తీస్​ గఢ్​ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్​ కౌంటర్​ 16 మంది నక్సల్స్​ మృతి

కోటి రివార్డు ఉన్న సీసీఎం సభ్యుడు చలపతి మృతి
వెయ్యిమందితో 10 బృందాల ప్రత్యేక ఆపరేషన్​

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ – ఒడిశా సరిహద్దు గరియాబంద్​, భాలు డిగ్గీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. సోమవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎన్​ కౌంటర్​ మంగళవారం కూడా కొనసాగుతోంది. ఈ ఎన్​ కౌంటర్​ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. కోటి రూపాయల రివార్డు ఉన్న జైరామ్​ (చలపతి) కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్​ లో వెయ్యిమందికి పైగా భద్రతా దళాలు పాల్గొన్నాయి. ఈ ఎన్​ కౌంటర్​ లో నక్సలైట్​ పెద్ద నాయకులతోపాటు ఓ మహిళా నక్సలైట్​ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్​ కౌంటర్​  గరియాబంద్​ ఎస్పీ నిఖిల్​, ఒడిశా నువాపాడ ఎస్పీ రాఘవేంద్ర, ఒడిశా డిఐజీ అఖిలేశ్వర్​ సింగ్​, కోబ్రా కమాండెంట్​ డీఎస్​ కథైట్​ ల పర్యవేక్షణలో జరిగాయి. 

భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ 10 టీమ్​ లుగా ఒడిశా నుంచి 3 బృందాలు, చత్తీస్​ గఢ్​ నుంచి రెండు, మరికొన్ని మార్గాల ద్వారా ఐదు సీఆర్పీఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్​ కౌంటర్​ సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్​ కౌంటర్​ జరిగిన ప్రాంతంలో మూడు ఐఈడీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సైనికులు భారీ డ్రోన్ల ద్వారా ముందుకు సాగుతూ ఆపరేషన్​ ను విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్​ కౌంటర్​ లో ఒక సైనికుడు గాయపడగా అన్ని ఎయిర్​ లిఫ్ట్​ చేసి చికిత్స అందింప చేస్తున్నారు.

జయరాంరెడ్డి (60) (రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము, చలపతి)పై కోటి రూపాయల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఇతను ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరులోని మాటెంపల్లిలో నివాసం. పదో తరగతి వరకు చదివిన చలపతి సెంట్రల్ కమిటీ క్యాడర్‌కు చెందినవాడు. బస్తర్​ అబూజ్​ మడ్​ ప్రాంతంలో ఇతను కీలకంగా వ్యవహరించేవాడు. ఇతని వద్ద ఎకె–47, ఎల్​ ఎల్​ ఆర్​ రైఫిల్​ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా.. 
ఈ ఎన్​ కౌంటర్​ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా స్పందించారు. నక్సల్స్​ ఉనికిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. తాజా ఎన్​ కౌంటర్​ తో నక్సలిజం వెన్నువిరిచామన్నారు. నక్సల్స్​ రహిత భారత్​ ను నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. 
..........................................