మిల్కిపూర్​ లో 9 గంటల వరకు 13.34 శాతం ఓటింగ్​

13.34 percent voting till 9 am in Milkipur

Feb 5, 2025 - 10:16
 0
మిల్కిపూర్​ లో 9 గంటల వరకు 13.34 శాతం ఓటింగ్​

లక్నో: అయోధ్యలోని మిల్కిపూర్​ లో ఉప ఎన్నికల ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలో 255 పోలింగ్​ కేంద్రాలు 414 బూత్​ లను ఏర్పాటు చేశారు. 3,70,829మంది ఓటర్లున్నారు. 10మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీజేపీ నుంచి చంద్రభాను పాశ్వాన్, ఎస్పీ నుంచి అజిత్​ ప్రసాద్​ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థి సంతోష్​ కుమార్​ కూడా సమాజ్​ పార్టీ (కాన్షీరామ్​) టికెట్​ పై పోటీ చేస్తున్నారు. దీంతో ఎస్పీకి నష్టం చేకూరనుందనే అభిప్రాయాలున్నాయి. ఉదయం 9 గంటల వరకు మిల్కిపూర్​ లో 13.34 శాతం ఓటింగ్​ నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్​ ఘటౌలి పోలింగ్​ స్టేషన్​ లో ఓటు వేశారు. మిల్కిపూర్​ లోని పలు కేంద్రాల్లో పొడవాటి క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్​ పోలింగ్​ బూత్​ లను ఏర్పాటు చేశారు.