అమెరికాలో కాల్పులు ముగ్గురి మృతి పదిమందికి గాయాలు

3 killed, 10 injured in shooting in America

Jun 22, 2024 - 15:39
 0
అమెరికాలో కాల్పులు ముగ్గురి మృతి పదిమందికి గాయాలు

వాషింగ్టన్​: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. అర్కాన్సాస్​ రాష్ర్టంలో ఓ దుకాణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందడంతో, 10మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగులు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు పడ్డట్టు ప్రత్యక్ష సాక్షలు తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పుల సందర్భంగా దుకాణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అర్టయ్యారు. కాల్పులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.