త్వరలో తేజస్​ అందజేస్తాం

హెచ్​ఎఎల్​ ఎండీ డి.కె. సునీల్​

Feb 12, 2025 - 13:36
 0
త్వరలో తేజస్​ అందజేస్తాం

బెంగళూరు: త్వరలోనే రక్షణ శాఖకు తేజస్​ యుద్ధ విమానాలను అందజేస్తామని హెచ్​ ఎఎల్​ (హిందూస్థాన్​ ఎరోనాటిక్స్​ లిమిటెడ్​) మేనేజింగ్​ డైరెక్టర్​ డి.కె. సునీల్​ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో త్వరలోనే తొలివిడత విమానాలను అందిస్తామని తెలిపారు. కాగా యుద్ధ విమానాలు అందకపోవడంపై ఎయిర్​ ఫోర్స్​ చీఫ్​ మార్షల్​ ఏపీ సింగ్​ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో హెచ్​ఎఎల్​ డైరెక్టర్​ ప్రకటన విడుదల చేశారు. 
కాగా 2028 నాటికి హెచ్​ ఎఎల్​ 83 తేజస్​ విమానాలను భారత వైమానిక దళానికి అందించే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ. 46, 898 కోట్లు. విమానాలకు ఇంజన్​ తయారీ బాధ్యత అమెరికాకు చెందిన జనరల్​ ఎలక్ర్టిక్​ సంస్థ రూపొందించనుంది. 

తేజస్​ ప్రత్యేకతలు..
– ప్రతీ గంటకు 2205 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
– 50వేల పీట్ల ఎత్తులో ఎగురుతుంది. 
– పొడవు 13.20 మీటర్లు, ఎత్తు 4.40 మీటర్లు, బరువు 6500 కిలోలు, ఒకేసారి మూడువేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. 

2022లో బెంగళూరు హెచ్​ ఎఎల్​ ను సందర్శించిన ప్రధాని మోదీ తేజ్​ యుద్ధ విమానాన్ని కోపైలెట్​ గా నడిపారు.