శివశక్తి పాయింట్ 3.7 బిలియన్ ఏళ్ల పురాతనమైనది!
Shivashakti point is 3.7 billion years old!

దక్షిణ ధృవం వివరాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: చంద్రయాన్ 3 ల్యాండింగ్ అయిన చంద్రునిలోని దక్షిణ ధృవ ప్రాంతం శివశక్తి పాయింట్ 3.7 బిలియన్ సంవత్సరాల పురాతనమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జియోలాజికల్ మ్యాపింగ్ డేటా విశ్లేషణ ద్వారా శివశక్తి పాయింట్ లో ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు బృందం పరిశీలించింది. బిలాలు, మైదానాలు, రాతిశకలాలు వివిధ రకాల శకలాలను రోవర్ అన్వేషణలో గుర్తించినట్లు కనుగొన్నారు. అంచనాల ప్రకారం చంద్రునిలోని శివశక్తి పాయింట్ అనేది 3.7 బిలియన్ సంవత్సరాలదన్నారు. అంటే జీవం ఉనికి ప్రారంభమైన కాలాన్ని సూచిస్తుందన్నారు. చంద్రయాన్ 3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్ కొంతకాలం నిర్లిప్తావస్తలోకి వెళ్లినా తిరిగి క్రియాశీలకంగా మారి ఆశ్చర్యకర విషయాలతో కూడిన సంకేతాలను అందజేస్తుంది. ఈ ల్యాండర్ అందించిన వివరాలను పరిశీలిస్తున్న సైంటిస్టులకు పలు వివరాలను అధ్యయనం చేయడంలో సులవవుతుంది. పలు కీలక వివరాలు బయటపడుతున్నాయి. ల్యాండింగ్ సైట్ కు 14 కిలోమీటర్ల దూరం దక్షిణంగా 540 మీటర్ల బిలం, పశ్చిమాన 10 మీటర్ల బిలం, రాతిశకలాలను గుర్తించారు.
2023 ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 మిషన్ చంద్రుని దక్షిణ ధృవంలో విజయవంతంగా ల్యాండింగ్ అయి నాలుగో దేశంగా నిలిచింది. అదే సమయంలో దక్షిణ ధృవానికి చేరుకున్న తొలి దేశంగా నిలిచింది.