యమునా నీటిలో విషం లేదు
కేజ్రీవాల్ పై సోనిపత్ లో కేసు నమోదు

సీఎం నాయబ్ సింగ్ సైనీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యమునా నీటిని హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ తాగారు. సీఎం కేజ్రీవాల్ ఈ నది నుంచి హరియాణా ద్వారా విషం వస్తుందన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. బుధవారం సీఎం ఢిల్లీలోని పల్లా గ్రామంలోని యమునా నది వద్దకు వెళ్లి తన చేతితో రెండుమూడుసార్లు దోసిడన్నీ నీరు తీసుకొని తాగారు. ఈ నీటిలో జలవనరుల శాఖ కూడా నమూనాలు తీసుకుందని కానీ ఎలాంటి విషపు ఆనవాళ్లు లభించలేదన్నారు. కేజ్రీవాల్ నీరు విషపూరితమని, మారణహోమాలని పిచ్చిపట్టినట్లు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ అర్థరహిత వ్యాఖ్యలపై సోనిపత్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 2 డి, 54 కింద కేసు నమోదు చేయనున్నారని సీఎం సైనీ వివరించారు.