పంజాబ్ పరిపాలన శాఖ రద్దు!
ఆప్ ఓటమితో అంతర్మథనంలో సీఎం మాన్ ప్రభుత్వం

చండీగఢ్: ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత పంజాబ్ భగవంత్ మాన్ సింగ్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. శనివారం మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పరిపాలనా సంస్కరణల శాఖ బాధ్యత నుంచి మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ ను తప్పించారు. ఏకంగా ఆ శాఖనే రద్దు చేస్తూ సీఎం భగవంత్ మాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సంస్కరణలకు కారణం అంతర్గత కలహాలేనని సమాచారం. అయితే ఈ కలహాలేంటనేది బయటికి పొక్కనీయటం లేదు. ప్రస్తుతం కుల్దీప్ ధాలివాల్ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. సీఎం మాన్ నిర్ణయంపై కుల్దీప్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. రేపో మాపో ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నాయనే వాదనలూ వినబడుతున్నాయి. కాగా శుక్రవారం 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయించింది.