రాష్ట్రపతి ప్రసంగం.. ధన్యవాద తీర్మానం ఆమోదం
President's speech.. Adoption of the vote of thanks

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం చర్చించి ఆమోదించారు. బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి మాట్లాడుతూ.. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. అందుకోసం అనేక కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలవి తప్పుడు ఆరోపణలే అన్నారు. బీజేపీ ఎంపీ బిధూరి మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇతర ప్రయోజనాలు చేకూర్చే అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. దేశరాజధానిలో 1700మందికి భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఢిల్లీలోని రోడ్ల స్థితి చూస్తే ప్రభుత్వం చేస్తున్న పనితీరు అర్థం అవుతుందన్నారు. ఢిల్లీ సీఎం నివాసానికి విచ్ఛలవిడిగా ప్రజల డబ్బులు ఖర్చు చేశారని మండిపడ్డారు.