మారిషస్​ లో తొలి జన ఔషధి కేంద్రం ప్రారంభం

ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జైశంకర్​

Jul 18, 2024 - 11:54
 0
మారిషస్​ లో తొలి జన ఔషధి కేంద్రం ప్రారంభం

పోర్ట్​ లూయిస్​: భారతదేశం వెలుపల తొలిసారి జన ఔషధి కేంద్రాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ ప్రారంభించారు. గురువారం ఔషధి కేంద్ర ప్రారంభంలో మారిషస్​ ప్రధాని ప్రవింద్​ కుమార్​ జుగ్నాథ్​ కూడా పాల్గొన్నారు. జన ఔషధి కేంద్రం భాగస్వామ్య ప్రాజెక్ట్​ అని జై శంకర్​ తెలిపారు. మారిషస్​ లో ఇరుదేశాల భాగస్వామ్యంలో భాగంగా ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. తక్కువ ఖర్చుతో మేడ్​ ఇన్​ ఇండియా ఔషధాలను సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చామని జై శంకర్​ తెలిపారు. గ్రాండ్​ బోయిస్​ గ్రామంలో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడంతో 16వేల మందికి ఈ కేంద్రం ద్వారా అత్యంత తక్కువ ధరలోనే మందులు అందనున్నాయి. ఆరోగ్యం పౌరులందరి హక్కు, ప్రాధాన్యతగానే భారత్​–మారిషస్​ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఒక్కటే, చిన్నదే అయినప్పటికీ సమాజం పట్ల ప్రభుత్వాల బాధ్యతలు నొక్కి చెబుతుందన్నారు. భవిష్యత్​ లో మరిన్ని జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎస్​.జై శంకర్​ స్పష్టం చేశారు.