ప్రయాగ్​ రాజ్​ @ 50 కోట్లు!

Prayag Raj @ 50 Crores!

Feb 12, 2025 - 17:22
 0
ప్రయాగ్​ రాజ్​ @ 50 కోట్లు!

లక్నో: ప్రయాగ్​ రాజ్​ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలాచరించిన వారి సంఖ్య బుధవారం సాయంత్రానికి 50కోట్లను మించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. ప్రపంచంలోనే ఏ ఆధ్యాత్మిక వేడుకకు ఇంతపెద్ద ఎత్తున భక్తులు హాజరైన దాఖలాలు కనుచూపు మేరలో కూడా లేవన్నారు. ఉత్తరప్రదేశ్​ జనాభానే 25కోట్లన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకపై పలువురు విమర్శలు, ఆరోపణలు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేశారని అఖిలేష్​ యాదవ్​ పై ఆరోపణలు సంధించారు. కరోనా వ్యాక్సిన్​ తీసుకోవద్దని ఓ వైపు చెబుతూనే రహాస్యంగా వ్యాక్సిన్​ తీసుకున్నారని అఖిలేష్​ చర్యలను బయటపెట్టారు. ఆయన త్రివేణి సంగమంలో స్నానమాచరించి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడని, ఇతరులు మాత్రం స్నానం ఆచరించవద్దని చెబుతాడని విమర్శించారు. మాఘ పూర్ణిమ సమయం బుధవారం రాత్రి 7.48తో ముగిసింది. 

కాగా బుధవారం నాడు పుణ్య స్నానాలకు ప్రముఖ నటుడు సునీల్​ శెట్టి, క్రికెటర్​ అనిల్​ కుంబ్లే, ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ (జితేంద్ర నారాయణ్​) సనాతన ధర్మాన్ని స్వీకరించి పుణ్య స్నానం ఆచరించారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్​ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించారు.