అజ్మీర్​ లో చాదర్​ సమర్పణ

ప్రధాని సందేశాన్ని వినిపించిన కేంద్రమంత్రి రిజిజు

Jan 4, 2025 - 14:12
 0
అజ్మీర్​ లో చాదర్​ సమర్పణ

జైపూర్​: దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. శనివారం రాజస్థాన్​ జైపూర్​ లోని అజ్మీర్​ దర్గాలో ప్రధాని మోదీ తరఫున చాదర్​ సమర్పించి ప్రార్థించారు. అనంతరం ప్రధాని మోదీ సందేశాన్ని రిజిజు వినిపించారు. దేశంలో మతాలు, కులాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలని అన్నారు. దర్గా సందర్శ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నవారు. యాప్​, వెబ్​ పోర్టల్​ సేవలు ప్రారంభిస్తామన్నారు. ఇందులో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుందని రిజిజు వివరించారు. ఈ యాప్​ తోపాటు గరబ్​ నవాజ్​ అనేయాప్​ ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఇదే గాకుండా ఉర్స్​ ఉత్సవాల కోసం ఆపరేషన్​ మాన్యువల్​ ను కూడా జారీ చేస్తామన్నారు.

అజ్మీర్​ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చాదర్​ ను కేంద్రమంత్రి రిజిజు సమర్పించారు. ఉర్సు ఉత్సవాలు జనవరి 1న ప్రారంభమయ్యాయి. రెండోరోజు కేంద్రమంత్రి చిరాగ్​ పాశ్వాన్​ చాదర్​ ను సమర్పించగా, మూడో రోజు ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇంద్రేష్ కుమార్, పలువురు బాలీవుడ్​ నటులు చాదర్​ ను సమర్పించి ప్రార్థించారు.