రాష్ట్రపతి భవన్​ లో పెళ్లి!

Marriage in Rashtrapati Bhavan!

Feb 11, 2025 - 13:47
 0
రాష్ట్రపతి భవన్​ లో పెళ్లి!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతి భవన్​ లో వివాహాం జరగబోతుంది. ఇందుకు అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూ కూడా ఓకే చెప్పారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది? ఎక్కడ? ఎందుకు జరుగుతుందనేది తెలుసుకుందాం. సీఆర్పీఎఫ్​ మహిళా అధికారి పూనమ్​ గుప్తా రాష్ట్రపతి భవన్​ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమె ధైర్యసాహసాలపై పలుమార్లు ఉన్నతాధికారులతోపాటు, ప్రధాని మోదీ కూడా కీర్తించారు. ఫిబ్రవరి 12 (గురువారం) పూనమ్​ గుప్తా రాష్ట్రపతి భవన్​ లోని మదర్​ థెరిస్సా కాంప్లెక్స్​ లో వివాహం జరగనుంది. వివాహం రాష్ట్రపతి భవన్​ లోనే చేసుకోవాలన్న కోరికపై పూనమ్​ గుప్తా అధ్యక్షురాలికి వివరించారు. లేఖ రూపంలో తన విజ్ఞప్తిని సమర్పించారు. ఇందుకు ద్రౌపదీ ముర్మూ సమ్మతించడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతి నివాసంలో వివాహనానికి లైన్​ క్లియర్​ అయ్యింది. కాగా ఈ వివాహానికి అత్యంత తక్కువ మందినే అనుమతించనున్నారు. 

పూనమ్​ గుప్తా..

సీఆర్పీఎఫ్​ లో అసిస్టెంట్​ మహిళా కమాండోగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్​ లో సెక్యూరిటీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి నాయకత్వం వహించి తన నిబద్ధతను చాటారు. ఈమె మధ్యప్రదేశ్​ లోని శివపురి నివాసి. కాగా సీఆర్పీఎఫ్​ లో అసిస్టెంట్​ కమాండెంట్​ గా పనిచేస్తున్న అవినాష్​ కుమార్​ ను పూనమ్​ వివాహం చేసుకోనున్నారు.