భారత్–ఇజ్రాయెల్ బంధాలు మరింత బలోపేతం
India-Israel ties will be further strengthened

ఎఫ్ సీసీఐ సమావేశంలో ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–ఇజ్రాయెల్ మధ్య వ్యాపార, వాణిజ్యాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు, సాంకేతికత, పరిశ్రమ రంగాల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ అన్నారు. మంగళవారం ఎఫ్ ఐసీసీఐ న్యూ ఢిల్లీలో నిర్వహించిన సీఈవో ఫోరం సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు మంత్రి పీయూష్ గోయల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్–భారత్ ల మధ్య మరింత బలోపేత చర్చలకు ఈ వేదిక ఆస్కారం కల్పించనుందన్నారు. దీంతో ఇరుదేశాల్లోనూ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. విస్తీర్ణ, జనాభా పరంగా తమది చిన్నదేశమే అయినప్పటికీ సాంకేతిక రంగంలో అత్యున్నతస్థాయిలో ఉన్నామన్నారు. భారత్ కూడా మోదీ నేతృత్వంలో సాంకేతికతంగా ఎదుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక, పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యం, విద్య, ఆవిష్కరణలు, వైద్యం, భద్రత, ఎఐ, తయారీ, సైబర్ భద్రత, ఎనర్జీ, వ్యవసాయం లాంటి పలు రంగాలపై ఇరుదేశాల వ్యాపారుల మధ్య ఫలప్రదమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. బీ2బీ (వ్యాపారం నుంచి వ్యాపారం–బిజినెస్ 2 బిజినెస్), జీ2బీ( ప్రభుత్వం నుంచి వ్యాపారం–గవర్నమెంట్ 2 బిజినెస్) అనే విధానాలు ఇరుదేశాల బంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి నిర్ బర్కత్ స్పష్టం చేశారు.