బాలికపై గంజాయి బ్యాచ్​ గ్యాంగ్​ రేప్​

నిందితుల కోసం పోలీసుల వేట

Jun 25, 2024 - 12:42
 0
బాలికపై గంజాయి బ్యాచ్​ గ్యాంగ్​ రేప్​

నా తెలంగాణ, హైదరాబాద్​: నేరెడ్​ మెట్​ బాలిక గ్యాంగ్​ రేప్​ కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతోంది. పలు కీలక విషయాలు వెలుగులొకొచ్చాయి. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన విజయ్​ కుమార్​ కు ఈ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. బాలికను ట్రా చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను నేరేడ్​ మెట్​ లోని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి స్నేహితులో కలిసి గ్యాంగ్​ రేప్​ కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక గర్భం దాల్చడంతో గుర్తించిన తల్లి నిలదీయడంతో అసలు విషయాలు వెలుగులుచూశాయి. దీంతో బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జీరో ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నేరెడ్​ మెట్​ ఠాణాకు కేసును బదిలీ చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వారు గంజాయి బ్యాచ్​ గా పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను రంంలోకి దింపారు.