జ్యోతిర్లింగాల్లో పోటెత్తుతున్న భక్తులు

Devotees pouring in Jyotirlingas

Feb 26, 2025 - 15:51
 0
జ్యోతిర్లింగాల్లో పోటెత్తుతున్న భక్తులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశంలో 12 జ్యోతిర్లింగాలున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా అన్ని జ్యోతిర్లింగాల్లోనూ భక్తులు దర్శనాలకు, ప్రత్యేక పూజలకు పోటెత్తారు.ఈ పుణ్య క్షేత్రాలను దర్శిస్తే మహాదేవుని ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. 

1. సోమనాథ్​: గుజరాత్ లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది. 

2. శ్రీశైలం: శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం కృష్నానది ఒడ్డున ఉంది. ఈ జ్యోతిర్లింగానికి వెళ్లాలంటే నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్​ పరిధిలోకి వచ్చే ఈ శైవక్షేత్రం ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందింది. 

3. మహాకాలేశ్వర్​: ఉజ్జయిని మహాకాలేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్​ లో ఉంది. 

4. ఓంకారేశ్వర్​: ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది.

5. భీమాశంకర్​: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉంది. 

6. కేదారనాథ్​.. హిమాలయాల్లో కేదార్ పర్వతంపై ఉన్న కేదార్​ నాథ్​ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. ఈ జ్యోతిర్లింగానికి వెళ్లే దారులను కూడా అధిగమించాల్సి ఉంటుంది. వర్షాలు, వరదలు, కొండా కోనలు, మంచు లాంటి పరిస్థితులను అధిగమించి ఈ శైవ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కూడా అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం పెద్ద యెత్తున చేపట్టింది. 

7. కాశీ విశ్వనాథ్​: ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది. ఇది శివుని అతి ముఖ్యమైన పూజా స్థలాలలో ఒకటిగా భావిస్తారు. పైగా కాశీ క్షేత్రమంటే ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకుంటాడు. మహాకుంభమేళా నిర్వహణ నేపథ్యంలో ఈ పుణ్య క్షేత్ర సందర్శన కూడా పెరిగింది. 

8. త్రయంబకేశ్వర్​: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్​ జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైనది. దేవుళ్లు, రాక్షసులు అమృతాన్ని సాధించే క్రమంలో ఈ ప్రాంతంలో కూడా అమృతధారలు పడ్డాయని చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతంలో కూడా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. 

9. వైద్యనాథ్​: జార్ఖండ్ లోని దేవగర్​ లో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ఈ ప్రాంతాన్ని చితాభూమి అని కూడా పిలుస్తారు. 

10. నాగేశ్వర: గుజరాత్ ద్వారకాపురి నాగేశ్వర జ్యోతిర్లింగం కొలువై ఉంది. 

11. రామేశ్వరం: తమిళనాడులోని రామనాథంలో రామేశ్వర జ్యోతిర్లింగం 11వదిగా ప్రసిద్ధి చెందింది. 

12. ఘృష్టేశ్వర: మహారాష్ట్రలోని సంభాజీనగర్ దౌలతాబాద్ సమీపంలో ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం ఆఖరి జ్యోతిర్లింగంగా కూడా పేర్కొంటారు.