సీ–295 తయారీ భారత్​ లోనే!

C-295 manufacturing in India!

Oct 30, 2024 - 15:47
 0
సీ–295 తయారీ భారత్​ లోనే!
రక్షణ రంగం మరింత బలోపేతం
ఎయిర్ బస్ –​ టాటా భాగస్వామ్యం
దక్షిణాదిన భారం.. సరిహద్దుల్లోనే చవక!
ప్లాంట్​ ను వడోదరాలో ప్రారంభించిన భారత్​–స్పెయిన్​ దేశాల ప్రధానులు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సీ–295 ఎయిర్​ క్రాఫ్ట్​ తయారీ యూనిట్​ భారత్​ లో ఏర్పాటైంది. ఇక ఉత్పత్తి, ఎగుమతులు ఈ విమానానికి సంబంధించి భారత్​ నుంచే జరగనున్నాయి. ఈ ఫ్యాక్టరీ గుజరాత్​ లో ఎయిర్​ బస్,​ టాటా భాగస్వామ్యంలో ఏర్పాటయ్యింది. ఈ ప్రాజెక్టు రాకతో మూడు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించనుండగా, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్పెయిన్​–భారత్​ భాగస్వామ్యంలో ఈ సంస్థను వడోదరాలో స్థాపించారు. దీంతో ఏవియేషన్​ పరిశ్రమలో భారత్​ భారీ అడుగులు వేసింది. దీంతో భారత్​ రక్షణ రంగంలో బలోపేతంతో పాటు ఆర్థికంగా మరింత బలపడనుంది. 
 
ప్రధాని మోదీ మేకిన్​ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్టు గేమ్​ ఛేంజర్​ గా రూపుదిద్దుకోనుంది. సీ–295 ట్రూప్ ట్రాన్స్‌పోర్ట్, కార్గో ఎయిర్‌లిఫ్ట్, వైద్య సహాయం, సముద్ర గస్తీలలో ఈ విమానాలు కీలకంగా మారనున్నాయి. అనేక మిషన్​ లలో ఈ విమానాన్ని ఉపయోగించనున్నారు. ఈ విమానం చిన్న రన్​ వేల నుంచి కూడా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా చైనా–భారత్​ సరిహద్దు వెంట ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఈ విమానాలు కీలకం కానున్నాయి. ఈ వమానంఓ ఒకేసారి 71 మంది సైనికులు/48 పారాట్రూర్​ లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆత్మనిర్భర్​ లో భాగంగా దేశీయంగా ఈ విమానాన్ని ఉత్పత్తి చేయడంలో దేశీయ అవసరాలకే గాక తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఎగుమతులు చేయడం వంటి వాటితో భారత రక్షణ రంగం మరింత పటిష్ఠం కానుంది. 
 
కాగా స్పెయిన్​ ద్వారా 56 విమానాల అందజేతకు ఒప్పందం జరిగింది. తొలివిడతగా 16 విమానాలను భారత్​ కు అప్పగించనుండగా, 40 విమానాలను మాత్రం టాటా అడ్వాన్స్​ డ్​ సిస్టమ్స్ ఎయిర్​ బస్​ సహకారంతో​ వడోదరలో రూపొందించనుంది. ప్రస్తుతం వరకు సీ–295 విమానాలు ఐదు భారత్​ కు అందించారు. ప్రాజెక్టు ద్వారా పూర్తి విమానాల తయారీకి 2031 సమయం పట్టనుంది.  
 
ప్రస్తుతం ఎయిరో స్పేస్​ రంగం బెంగళూరు, హైదరాబాద్​, బెల్గాం వంటి దక్షిణాది ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నా ఇక్కడి నుంచి ట్రాన్స్​ పోర్టేషన్​ సరిహద్దుల వరకూ చేరిక, అక్కడి నుంచి తరలింపు తలకుమించిన భారంగా మారడంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఇటువంటి ప్లాంట్లను నెలకొల్పితే సౌకర్యవంతంగా ఉంటుందని భావించి గుజరాత్​ లోని వడోదరాలో ఈ ప్లాంటును నెలకొల్పింది. 
 
రెండు రోజుల క్రితమే (సోమవారం) స్పెయిన్​ ప్రధాని పెడ్రో సాంచెజ్​ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీ–295 ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించారు.