2025–26 బడ్జెట్–2
Budget 2025–26–2

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను ఉండదు. గత 4 సంవత్సరాలుగా ఐటీ రిటర్న్‌లను ఫైల్ చేయగలుగుతారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. రూ. 12 లక్షలకు రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే మొత్తం రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.
వేతన జీవులకు భారీ ఊరట..
సాలరీడ్ (వేతన) జీవులకు రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. సామాన్యులకు రూ.4–8 లక్షల ఆదాయం కలిగిన వారు 5 శాతం, రూ.8–-12 లక్షలు సంపాదన ఉన్నవారికి 10 శాతం, రూ.12–-16 లక్షలు సంపాదనపై 15 శాతం, రూ.16–-20 లక్షలు సంపాదనపై 20 శాతం, రూ.20–-24 లక్షలపై 25 శాతం, రూ.24 లక్షలపై బడి సంపాదన ఉన్నవారికి 30 శాతం పన్నును విధించారు. రూ.
ఏడు రకాల టారిఫ్ రేట్ల తొలగింపు..
ఏడు రకాల టారిఫ్ రేట్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎనిమిది టారిఫ్ రేట్లు మాత్రమే ఉంటాయి. సాంఘిక సంక్షేమ సర్‌చార్జిని తొలగించనున్నారు.