అయోధ్య రాముడికి మహా సంప్రోక్షణ

జనవరి 11 నుంచి 13వరకూ నిర్వహణ

Jan 9, 2025 - 16:48
 0
అయోధ్య రాముడికి మహా సంప్రోక్షణ

లక్నో: అయోధ్య శ్రీ రామమందిర ప్రతిష్ఠాపన జరిగి ఒక సంవత్సరం గడిచినందున జనవరి 11న ప్రతిష్ఠాపన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. గురువారం ఈ విషయాన్ని అయోధ్య రామ మందిర ఆలయ కమిటీ మీడియాకు వివరించింది. మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీరాములవారికి పీతాంబరి వేషధారణలో అలంకరిస్తారు. ప్రత్యేక దుస్తులను ధరింపచేస్తారు. ఢిల్లీలో ప్రత్యేక దుస్తులను సిద్ధం చేస్తున్నారు. బంగారం, వెండి తీగలతో శ్రీరాముడి బట్టలకు ఎంబ్రాయిడరీ కొనసాగుతుంది. జనవరి 10 నాటికి ఈ ప్రత్యేక దుస్తులు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ దుస్తులను మనీష్​ త్రిపాఠి అనే డిజైనర్​ రూపొందిస్తున్నారు.

 11, 12, 13 మూడు రోజులపాటు మహా సంప్రోక్షణ వేడుకలు నిర్వహించనున్నారు. 11న శంకుస్థాపనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ప్రత్యేక పూజలు, దీక్షలు, అభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం హారతి, రాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శ్రీరాములవారికి ప్రత్యేక దుస్తులతో పాటు ప్రత్యేక నగలను కూడా ధరింప చేయనున్నారు. రత్నాలు, పట్టువస్ర్తాలు, ధోతీ, కిరీటం, బంగారు హారం, ఇతర ఆభరణాలను సిద్ధం చేశారు. అయోధ్యకు ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. మహాకుంభ మేళా సందర్భంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
...................