మానవత్వానికి శత్రువు సోరోస్​

మరోమారు మండిపడ్డ ఎలన్​ మస్క్​

Jan 9, 2025 - 16:23
 0
మానవత్వానికి శత్రువు సోరోస్​

వాషింగ్టన్​: జార్జ్​ సోరోస్​ పై ఎలన్​ మస్క్​ మరోమారు మండిపడ్డాడు. సోరోస్​ మానవత్వానికి శత్రువుగా అభివర్ణించారు. గురువారం సామాజిక మాధ్యమం వేదికగా మస్క్​ పదునైన విమర్శలు చేశారు. సోరోస్​ నిజమైన విలన్​ అని మానవత్వాన్ని ద్వేషిస్తారని వ్యాపార, సేవా ముసుగులో ఆయన చేసే కార్యకలాపాలు అనైతికమైనవని ఆరోపించారు. హమాస్​ కు మద్ధతు ఇస్తున్న సంస్థలకు సోరోస్​ 15 మిలియన్​ డాలర్ల ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇది సిగ్గుచేటన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్​ పంచుకున్న నివేదికను మస్క్​ ప్రదర్శించారు. సోరోస్​ తన నిజమైన ఉద్దేశాలను దాచిపెడుతున్నాడని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సోరోస్​ కు అత్యున్నత పురస్కారం అందజేయడంపై కూడా ఎలన్​ మస్క్​ తీవ్రంగా ఆగ్రహం చేసిన విషయం తెలిసిందే.