హీట్ వేవ్స్ తో త్వరగా వృద్ధాప్యం
అమెరికా శాస్ర్తవేత్తల పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: హీట్ వేవ్స్ వల్ల త్వరగా వృద్ధాప్యం దరిచేరుతుందని అమెరికన్ శాస్ర్తవేత్తలు ఆస్ర్టేలియాలో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనల ప్రకారం సూర్యుని కిరణాలు నేరుగా మనిషిపై ప్రభావం చూపి వారి శక్తినంతా హరించివేస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా ఉన్న కణాల్లో కూడా నీటిశాతం తగ్గుతుంది. తేమశాతం తగ్గడంతో ఇది శరీంపై ప్రభావం చూపి త్వరగా వృద్ధాప్యానికి కారణంగా నిలుస్తుందని ఆ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో ఆస్ర్టేలియాకు చెందిన 3700మంది ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. వేడివల్ల ఎపిజెనెటిక్స్ ను మార్చివేస్తుంది. ఈ ప్రక్రియలో కణాలపై ఒత్తిడి పెరిగి జన్యువులు నిష్క్రియం అవుతాయి. ఉష్ణోగ్రతలను శరీరాలు తట్టుకునే క్రమంలో వేగంగా వృద్ధాప్యం దరిచేరుతుందని పరిశోధన నివేదికలు వెల్లడించాయి.అంతేగాక తీవ్రమైన వేడి వల్ల మనిషి శరీరంపై ఒత్తిడి పడి పనివేగం కూడా తగ్గుతుందని గుర్తించాయి. అయితే డీఎన్ ఎలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాయి. అయితే ఈ పరిశోధనలో మూడు రకాల జన్యు పరిశోధనలను కొలిచారు. ఇవి వయస్సు చక్రాలను కొలిచేందుకు ఉపయోగపడతాయి. ‘పీసీ ఫోనె ఏజ్, పీసీ గ్రిమ్ ఏజ్, డూనేడిన్ పేస్’ అనే చక్రాల పరిశోధనలో ఈ ఫలితాలు తేలినట్లు అమెరికన్ శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు.