ఓటమికి అగ్రనేతలే బాధ్యత వహించాలి
Top leaders are responsible for the defeat

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ ఓటమి పరిణామాలతో అధిష్ఠానం కలత చెందింది. భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో ఓటమికి పార్టీ అగ్ర నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేతలతో న్యూ ఢిల్లీలోని ఇందిరాభవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు అట్టడుగు స్థాయిలో పనిచేయాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఢిల్లీ పరాజయం నేపథ్యంలో వచ్చిన వ్యాఖ్యలపై మౌనం వహించడం సరికాదన్నారు. పార్టీలో కొన్ని మార్పులు ఇప్పటికే జరిగినా, త్వరలోనే మరిన్ని మార్పులు జరుగుతాయని ఖర్గే చెప్పారు.