అమృత్ సర్ కు సీ–17
క్షేమంగా తిరిగొచ్చిన 104 మంది భారతీయులు
చండీగఢ్: పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో అమెరికా సీ17 విమానం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన 104 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకే రావాల్సిన ఉన్న విమానం అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్టకు చెందిన వారు ఉన్నారు. వీరందరి వివరాలు సేకరించిన అధికారులు వారిని వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో వీరు భారత్ నుంచి అక్రమంగా ఏయే మార్గాల ద్వారా వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. అమెరికా లెక్కల ప్రకారం 18వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నారు. వీరిలో తొలి విడతలో 5000 మందిని భారత్ కు తిరిగి పంపే ఏర్పాట్లను పెంటగాన్ చేపట్టింది. అదే సమయంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం అమెరికాలో చాలా కాలంగా అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య 7.25 లక్షల మంది అని వెల్లడించింది. అక్రమ వలసదారుల్లో మూడవ అతిపెద్ద సంఖ్యగా ఉంది. తొలివరుసలో మెక్సికో, రెండో స్థానంలో ఎల్ సాల్వడార్ ఉన్నాయి.