రూ. 122 కోట్ల కుంభకోణం
న్యూ ఇండియా బ్యాంకు మేనేజర్ అవినీతి

ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు ముమ్మరం
ముంబాయి: న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యల అనంతరం పెద్ద విషయం బయటకు వచ్చింది. మాజీ మేనేజర్ రూ. 122 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఈ అవినీతిపై విచారణ జరుగుతున్న విషయం బయటకు వచ్చింది. 2020 నుంచి 2025 మధ్య మాజీ జనరల్ మేనేజర్ హితేష్ ప్రవీన్ చంద్ మెహతా మేనేజర్ గా ఉండగా ఈ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. దాదర్, గోరేగావ్ బ్రాంచ్ కు ఇన్ చార్జీగా కూడా ఈయన ఉన్నారు. తన పదవిని దుర్వినియోగం చేస్తూ పెద్ద మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో హితేష్ తోపాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. లెక్కల్లో అవకతవకలను గుర్తించి బ్యాంకు చీఫ్ అకౌంట్స్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసును పోలీసులు ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఈ కుంభకోణంపై భారత భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 316 (5), 61 (2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ భారీ స్కామ్ పై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ కఠిన ఆంక్షలను విధించినట్లు తెలుస్తుంది.