ఉర్సులాకు ప్రధాని అభినందనలు
భారత్–యూరోప్ భాగస్వామ్యం పటిష్ఠానికి మరింత ఊతం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–యూరోప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్ లేయన్ ను శుక్రవారం మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచప్రయోజనాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం చేసేందుకు, తమతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని ప్రధాని తెలిపారు.