ప్రపంచదేశాలపై లాజరస్​ హ్యాకర్ల కన్ను!

Lazarus hackers eye on the world!

Dec 24, 2024 - 16:12
 0
ప్రపంచదేశాలపై లాజరస్​ హ్యాకర్ల కన్ను!

జపాన్​, అమెరికాలకు ముచ్చెమటలు
భారత్​ అప్రమత్తం
బిట్​ కాయిన్లు, క్రిప్టో కరెన్సీల దొంగతనం
కీలక డేటా తస్కరణ, బ్లాక్​ మెయిలింగ్​ 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​ డిజిటల్​ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. సాంకేతిక పరంగా కూడా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సేకరిస్తున్న ప్రజల డేటా సైబర్​ దొంగల బారిన పడితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కేంద్ర, రాష్​ర్ట ప్రభుత్వాలు సైబర్​ అటాక్​ లను నివారించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా హ్యాకర్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ వివిధ మార్గాలలో ప్రజలను బురిడీ కొట్టిస్తూ వారి సంపదనంతా దోచుకుతింటున్నారు. ఇలాంటి కేసులు కేవలం భారత్​ కే కాదు.. ప్రపంచానికి కూడా పెను సవాల్​ గా మారుతున్నాయి. లాజరస్​ అనే సైబర్​ హ్యాకర్ల గ్రూప్​ ప్రస్తుతం ప్రపంచదేశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా దేశాల ఇంటలిజెన్స్​ లు ఈ ముఠా చర్యలపై దృష్టిసారిస్తూ అప్రమత్తం అయ్యాయి.

జపాన్​, అమెరికాలకు బురిడీ..
లాజరస్​ గ్రూప్​ ఈపేరు వింటేనే ప్రస్తుతానికి ప్రపంచానికి వణుకుపుడుతోంది. ఈ గ్రూప్​ సైబర్​ దాడులలో దిట్ట. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ పై వివాదాస్పద, ప్రకటనలు, వీడియోలు చేస్తూ ప్రపంచాన్ని మభ్య పెట్టించారు. జపాన్, అమెరికాకు చెందిన బిట్​ కాయిన్​, క్రిప్టో కరెన్సీలను ఎగేసుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక డాక్యుమెంట్లు, బ్యాంకులు, సంస్థలు, ప్రభుత్వ నివేదికలున దొంగతనం చేయడంలో ఈ ముఠా సిద్ధ హస్తులు. ఇప్పటివరకూ ఈ ముఠా ఎక్కడి నుంచి పనిచేస్తుందనే విషయాన్ని కనుగొనకపోవడం విశేషం. దేశాలకు సంబంధించిన సున్నితమైన డేటాను బహిర్గతం చేస్తూ బ్లాక్​ మెయిల్​ కు పాల్పడుతూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తారు. అడిగినంత సమర్పించుకోకుంటే ఆ డేటాను బహిరంగ మార్కెట్​ లో విక్రయానికి పెట్టేస్తారు. 

ప్రపంచదేశాలపై నజర్​..
ప్రస్తుతం ఈ గ్రూప్​ దక్షిణ కొరియా, అమెరికాలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బంగ్లాదేశ్, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, గ్వాటెమాల, హాంకాంగ్, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పోలాండ్, సౌదీ అరేబియా, స్పెయిన్ , స్విట్జర్లాండ్ , థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి దేశాలపై కూడా ఈ సైబర్​ దాడుల ముఠా కన్నేసి ఉంచినట్లు ఆయా దేశాల ఇంటలిజెన్స్​ లు అప్రమత్తత సమాచారాన్ని పంచుకున్నాయి. 

కిమ్​ జోంగ్​ హస్తమా?
జపాన్, అమెరికాలకు చెందిన 300 మిలియన్​ డాలర్ల క్రిప్టో కరెన్సీ దొంగతనంపై ఉత్తర కొరియా హ్​యాకర్లే కారణమని గుర్తించారు. కానీ వారు ఎవరో? గుర్తించలేదు. లాజరస్​ గ్రూప్​ ను ఉత్తరకొరియా ప్రభుత్వమే నడుపుతున్నట్లుగా కూడా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు కిమ్​ జోంగ్​ పై ఆరోపణలు కూడా కొనసాగాయి. 

ఈ గ్రూప్​ ప్రముఖ దాడులు..
2014లో సోని పిక్చర్స్​ నెటవర్క్​ హ్యాక్​. కిమ్​ ఇంటర్వ్యూ ట్యాంపరింగ్​. (ఫేక్​ వీడియో సృష్టి)
కోవిడ్​ 19 సమయంలో ఫార్మాకంపెనీలపై సైబర్​ దాడులు ఫార్మూలా దొంగిలించే యత్నం.
వివిధ దేశాల డేటా హ్యాక్​. బయట పెడతామని బెదిరింపులు. భారీ ఎత్తు వసూళ్లకు పాల్పడింది. కానీ ఈ విషయాన్ని ఆయా దేశాలు బయటికి పొక్కనీయలేదు. 
2015లో ఈక్వెడార్​ లోని బాంకో డెల్​ ఆస్ర్టో ఉంచి 12 మిలియన్ల యూఎస్​ డాలర్లు, వియత్నాం టియన్​ ఫాంగ్ బ్యాంక్​ నుంచి 1 మిలియన్​ యూఎస్​ డాలర్ల సంపదను దోచుకుంది. 
పోలాండ్​, మెక్సికో, బంగ్లాదేశ్​ బ్యాంకుల ద్వారా 81 మిలియన్​ యూఎస్​ డాలర్లను కూడా దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. 
2017లో తైవాన్​ ఫార్​ ఈస్టర్న్​ ఇంటర్నేషనల్​ బ్యాంక్​ నుంచి 60 మిలియన్ల డాలర్లను దొంగిలించింది.