అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు
Increasing support for Kamala Harris in the US presidential election
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ కు అమెరికా ఉపాధ్యక్షురాలుకు పూర్తి మద్ధతు లభించింది. అధ్యక్ష ఎన్నికలపై ఎవరు పోటీ చేయాలనే విషయంపై పార్టీ ఓటింగ్ ను చేపట్టింది. దీంతో కమలా హారీస్ కు 1976మంది పార్టీ ప్రతినిధుల మద్ధతు లభించింది. మొత్తం నాలుగువేల మందిలో కమలా హారీస్ ఈ రోజు వరకు 1976మంది మద్దతును సాధించగలిగారు. రోజురోజుకు ఆమెనే అధ్యక్షురాలిగా చేయాలన్న మద్ధతు పెరుగుతూ వస్తోంది.
జో బైడెన్ పార్టీ నిర్ణయం మేరకు అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. వయోభారం రీత్యా ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎంపిక అనివార్యమైంది.