ప్రభుత్వం గద్దె దిగాలని నేపాల్ లో నిరసనలు
Protests in Nepal demand government's resignation

ఖాట్మాండు: నేపాల్ లో అవినీతి, అక్రమ ప్రభుత్వం గద్దె దిగాలని రాజు జ్ఞానేంద్రకు అధికారాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాచరిక మద్ధతుదారులు శుక్రవారం భారీ నిరసనలకు దిగారు. ఖాట్మాండులో మద్ధతుదారులు వీధుల్లోకి వచ్చారు. నవరాజ్ సుబేది (87) ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నిరసనల్లో నేపాల్ లో ఉన్న 40 సంఘాలు పాల్గొంటున్నాయి. నిరసనకారులు టింకునేలో ఒక భవనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. పోలీసులు ఆందోళనకారులపై గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
హిందూ దేశంగా పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్ తో నేపాల్ లో గత కొంతకాలంగా స్వల్ప నిరసనలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 19న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ప్రజల నుంచి మద్ధతు కోరారు. అప్పటి నుంచి ఈ నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. కాగా నిరసనలపై నవరాజ్ సుబేది మాట్లాడుతూ..మా డిమాండ్లను శాంతియుతంగా ముందుకు తెస్తున్నాము, కానీ మాకు సానుకూల స్పందన రాకపోతే నిరసనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. చేయవలసి వస్తుంది. మా లక్ష్యం సాధించే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది" అని నవరాజ్ సుబేది అన్నారు. కాగా నిరసనలను ప్రధానమంత్రి కెపీ శర్మ ఓలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.