కాలుష్య నగరాల్లో 13 భారత్ లోనే!
13 of the most polluted cities are in India!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 13 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. డబ్ల్యూహెచ్ వో కాలుష్య కారక నగరాల నివేదికను విడుదల చేసింది. ఈ 2024 నివేదిక ప్రకారం కాలుష్యపూరిత దేశాలలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అత్యంత ఉత్తమ కాలుష్యం లేని నగరంగా ఓషియానియా దేశాలు (ఆస్ర్టేలియా, న్యూజిలాండ్, ఫిజీ, పాపువా న్యూగినియా, నౌరు, కిరిబాటి, మార్షల్ దీవులు సహా మరో 14 దేశాలు) ఉన్నట్లు వెల్లడైంది. కాగా 2023 నివేదికలో భారత్ మూడో స్థానంలో ఉండగా, ప్రస్తుతం కొంత మెరుగుదల ఏర్పడి ఐదో స్థానానికి చేరుకుంది. 2024లో పీఎం 2.5 క్యూబిక్ మీటర్ సగటున 50.6 మైక్రో గ్రాములుగా ఉన్నాయి. ఇది 2023లో 54.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. కాగా నివేదిక ప్రకారం పది కాలుష్య నగరాల్లో ఆరు ఢిల్లీలోనే ఉండడం గమనార్హం.
భారత్ లో కాలుష్య నగరాలు..
బనిహాట్ (మేఘాలయ), ఢిల్లీ, ముల్లాపూర్ (పంజాబ్), ఫరీదాబాద్ (హరియాణా), లోనీ (యూపీ), న్యూ ఢిల్లీ, గురుగ్రామ్ (హరియాణా), శ్రీగంగానగర్ (రాజస్థాన్), గ్రేటర్ నోయిడా (యూపీ), బివాండీ (రాజస్థాన్), ముజఫర్ నగర్ (యూపీ), హనుమాన్ గఢ్ (రాజస్థాన్), నోయిడా (యూపీ).
2024లో అత్యంత కాలుష్యం కలిగిన దేశాలు..
చాడ్ (ఆఫ్రికా), బంగ్లాదేశ్, కాంగో (ఆఫ్రికా), పాకిస్థాన్, భారత్
పరిష్కారాలు..
– ఇప్పటికే భారత ప్రభుత్వం కాలుష్యకారకాలపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉంది. నిపుణుల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. గాలిలో నాణ్యతను మెరుగుపరిచేందుకు చట్టాలకు మరింత పదును పెట్టాల్సి ఉంది. అదే సమయంలో పారిశ్రామికీకరణలో పెద్ద ఎత్తున సాంకేతికత సహాయంతో కాలుష్యాన్ని తగ్గించే చర్యలను తీసుకోవాల్సి ఉంది.
నిపుణుల సూచనలు.. సలహాలు..
– దేశంలో సుమారుగా కట్టెలపోయ్యి లాంటివి మూలనపడ్డాయనే చెప్పాయి. మోదీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి ఎల్పీజీ కనెక్షన్ మంజూరు చేయడంతో భారీగా కాలుష్యాన్ని తగ్గించగలిగింది.
– పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు మరింత ప్రోత్సాహం లభించాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో రవాణా మెరుగుదలతో సొంతవాహనాల వాడకాన్ని తగ్గించే ఆస్కారం ఉంది.
– నిర్మాణాల ద్వారా భారీ కాలుష్యం వెదజల్లుతుంది. దుమ్ముధూళితో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రతీ నిర్మాణం వద్ద దుమ్ముధూళి ఎగరకుండా పకడ్భందీ చర్యలు చేపట్టాలి.
– కాలుష్యం తగ్గించడంలో ముఖ్యంగా ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రతీఒక్కరూ కాలుష్యాన్ని రక్షించుకోవడం తమ స్వంతబాధ్యతగా భావించినప్పుడే భవిష్యత్ తరాలుగా స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించొచ్చు. ఈ దిశలో ప్రభుత్వం కఠిన చర్యలకు వెనుకాడొద్దు.