ఎఫ్​ సీపీఎ చట్టం రద్దు

ట్రంప్​ సంతకాలు, ఉత్తర్వులు జారీ

Feb 11, 2025 - 13:12
Feb 11, 2025 - 13:13
 0
ఎఫ్​ సీపీఎ చట్టం రద్దు

అదానీ, ప్రముఖులకు భారీ ఊరట
మోదీ పర్యటనకు ముందే తీపికబురు

వాషింగ్టన్​: విదేశాల్లో అవినీతి నిరోధక చట్టాన్ని (ఎఫ్​ సీపీఎ) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ రద్దు చేశారు. మోదీ పర్యటనకు ముందురోజు ఈ నిర్ణయం తీసుకోవడంతో భారతీయుల్లో, వ్యాపారుల్లో ఆందోళనలకు చెక్​ పడినట్లయ్యింది. ఇదే చట్టం ప్రకారం భారతీయ ప్రముఖ వ్యాపారి అదానీపై కేసు నమోదైంది. ఈ చట్టం రద్దుతో ఇకపై విదేశాలలో లంచం ఆరోపణలు నేరం కింద పరిగణించబడవు. ఈ చట్టం గత 50ఏళ్లుగా అమెరికాలో కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రంప్​ దీన్ని రద్దు చేశారు. రద్దు ఉత్తర్వులపై ప్రముఖులు సంతకాలు చేశారు. దీంతో ఈ చట్టం కింద తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు నూతన మార్గదర్శకాలను రూపొందించనున్నారు. అమెరికా అటార్నీ జనరల్​ పామ్​ బోండిని ట్రంప్​ ఆదేశించారు. ఈ చట్టం కింద అదానీతోపాటు మరో 8మందిపై కూడా కేసు నమోదైంది.