ముఖ్యాంశాలు
Highlights

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశ, అంతర్జాతీయ పరిణామాలు శుక్రవారం..
– రష్యా మాస్కోవిజయ దినోత్సవ వేడుకల్లో పుతిన్‌తో కలిసి పాల్గొన్న 27 దేశాల నాయకులు. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున ప్రధాని మోదీ వెళ్లాల్సి ఉన్నా భారత్–పాక్ యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యటనను రద్దు చేసుకున్నారు.
– చండీగఢ్‌లోని దుకాణాలు, రెస్టారెంట్లు, మార్కెట్లు శుక్రవారం సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించారు.
– మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నామని అమెరికాలో భారత రాయబారి క్వాత్రా అన్నారు. మానవాళికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా పరిగనించారు.
– గుజరాత్‌లో మే 15 వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో డ్రోన్లు, బాణసంచాపై పూర్తి నిషేధం విధించారు.
– 24 కి పైగా నగరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ నిన్న రాత్రి 500 డ్రోన్లను ప్రయోగించింది. భారత్ భారీ ఎత్తున ఈ దాడులను తిప్పికొట్టింది.
– భారత ముస్లింలు పాకిస్థాన్‌ను ద్వేషిస్తారని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. దేశం పట్ల తనకున్న ప్రేమను చాటారు. పాక్ తో దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
– పాకిస్తాన్‌తో ఉద్రిక్తత కారణంగా జమ్మూ కాశ్మీర్‌లోని పాఠశాలలు మే 12 వరకు మూసివేశారు.
– ఐపీఎల్ 2025ను వాయిదా వేశారు. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు.
– విదేశాంగ మంత్రి జైశంకర్ యుకె విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టారు. భారత్ ఇక వెనక్కి తగ్గబోదన్నారు.
– బెంగాల్‌లోని బిర్భూమ్‌లో జమాత్- ఉల్ -ముజాహిదీన్ బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
– పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ, హోం, ఆర్థిక, ఆరోగ్య మంత్రిత్వ శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో భారీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వెంటనే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వైద్యం శీఘ్రంగా అందనుంది.
– ముంబాయి భద్రత కోసం కోస్ట్ గార్డ్ నేవీ పోలీసులు కలిసి పనిచేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీలో అలర్ట్ కోసం సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజధాని నగరం కాబట్టి పెద్ద ఎత్తున చరిత్ర కలిగి ఉన్న భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
– పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేకూర్చేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
– భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ విడుదలకు కోర్టులో పిటిషన్ దాఖలైంది.
– జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ ఆఫీసర్ మనోజ్ సిన్హా ఉరీ చేరుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు.
– త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు గంటలపాటు సమావేశం నిర్వహించారు.
– పంజాబ్ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అందరూ అధికారుల సెలవులను రద్దు చేసింది. అత్యవసరంగా విధుల్లో చేరాలని ఆదేశించింది.
– సరిహద్దు పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు రక్షణ మంత్రి, రా తో ఆరా తీస్తున్నారు.