ఉపరాష్ట్రపతి డిశ్చార్జీ

Vice President's discharge

Mar 12, 2025 - 12:25
 0
ఉపరాష్ట్రపతి డిశ్చార్జీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్​ ధంఖర్​ ఢిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. బుధవారం డిశ్చార్జీ అయిన ఆయనకు కొద్దిరోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. మార్చి 9న ధంఖర్​ శ్వాసకోస సంబంధిత, గుండె సంబంధిత అనారోగ్యంతో ఎయిమ్స్​ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన్ను పరామర్శించారు. ధంఖర్​ అనారోగ్యానికి సంబంధించి ఎయిమ్స్​ వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆయన త్వరగా కోలుకున్నారు.