పుంజుకుంటున్న మార్కెట్లు రెండోరోజు లాభాలు
Rising markets post second day of gains

ముంబాయి: ట్రంప్ రాక.. పలు ప్రకటనలు, సుంకాల పెంపు, షేర్ మార్కెట్ నుంచి ఉపసంహరణలు, యుద్ధభయాలతో గత పది రోజులుగా నేలచూపులు చూసిన భారతీయ షేర్ మార్కెట్ రెండు రోజులుగా పైకి ఎగబాగుతుంది. మొత్తానికి బేర్ దాడిని బుల్ సమర్థవంతంగా ఎదుర్కోవడం నేర్చుకున్నట్లుందన్నట్లు మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో పెట్టుబడుల వరద మళ్లీ మొదలవుతుంది. గురువారం సెన్సెక్స్ 73,817.65 (87.42), నిఫ్టీ 35.05 పాయింట్లు పెరిగి 22,372.35 వద్ద ముగిశాయి. దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభం అయినా చివరలో లాభాలను చవిచూశాయి. రూపాయి కూడా బలపడింది. మెటల్, చమురు, గ్యాస్ షేర్లలో పెరుగుదల నమోదైంది. చైనా ఉద్దీపన ప్యాకేజీ, ట్రంప్ సుంకాలను పెంచే నిర్ణయాన్ని ఒక నెలపాటు వాయిదా వేయడం లాంటి సానుకూల నిర్ణయాలతో మార్కెట్లు బలపడ్డాయి.