ఎఎంయూలో హోలీకి నో!

No to Holi in AMU!

Mar 6, 2025 - 17:23
 0
ఎఎంయూలో హోలీకి నో!

ఇఫ్తార్​ లకు ఎలా అనుమతించారు
నిర్వహించి తీరుతాం బీజేపీ నేత శకుంతల వార్నింగ్​
విషయాన్ని సీఎం యోగి దృష్టికి తీసుకువెళతా

లక్నో: అలీఘర్​ ముస్లిం యూనివర్సిటీలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని విశ్వవిద్యాలయం ప్రకటించింది. దీంతో హిందూ విద్యార్థులు, బీజేపీ మాజీ మేయర్​ శకుంతల భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం యూనివర్సిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. గత నెల 25నే విద్యార్థులు హోలీ వేడుకల నిర్వహణపై లేఖను సమర్పించి పరిపాలన అనుమతిని కోరారు. దీనికి ప్రతిగా ఎఎంయూ వైస్​ చాన్స్​ లర్​ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాలయ ప్రొఫెసర్లు, డీన్లు పాల్గొన్నారు. క్యాంపస్​ లో నూతన సాంప్రదాయాన్ని పాటించరాదని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. ఎఎంయూ ప్రతీ హాస్టల్​ లో, భవనంలో ఇఫ్తార్​ విందులు ఇస్తుండగా, తమ పర్వదినం నిర్వహించుకుంటామంటే ఎందుకు నిరాకరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈద్​, మొహర్రం, ఇతర ఊరేగింపులకు అనుమతిస్తూ తమ పండుగలకు అనుమతినీయరా? అని ప్రశ్నించాయి. ఎఎంయూ వీసీ వెంటనే అనుమతినీయాలని కోరారు. 

ఈ విషయంపై ప్రొఫెసర్​ మహ్మద్​ వసీం అలీ మాట్లాడుతూ.. దరఖాస్తు అందిందని, వైస్​ చాన్స్​ లర్​ కు పంపించామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమ నిర్వహణకు ఇంతకు ముందు కూడా అనుమతి లేదని, ప్రస్తుతం కూడా అనుమతించలేదన్నారు. 

అనుమతి మంజూరు చేయకపోవడంపై బీజేపీ మాజీ మేయర్​ శకుంతల భారతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఇది పాకిస్థాన్​ కాదన్నారు. విశ్వవిద్యాలయం ఎవరి వ్యక్తిగత ఆస్తికాదన్నారు. ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, హిందువులకు ఎలాంటి హక్కు లేదన్నారు. హోలీకి అనుమతించకపోతే ఈద్​ కూడా నిర్వహించుకోవదన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హోలీ ఐక్యత, ప్రేమ, త్యాగాలకు చిహ్నామన్నారు. తాను సీఎం యోగి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతానని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలను నిర్వహించి తీరుతామని హెచ్చరించారు.