షమీ డ్రింక్ వివాదాస్పదం!
Shami's drink is controversial!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాచ్ సందర్భంగా ఎనర్జీ డ్రింక్ తాగడం వివాదాస్పదమైంది. దీనిపై గురువారం ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్ధీన్ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షమీ పెద్ద తప్పుచేశాడని అభివర్ణించాడు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమన్నాడు. పెద్ద పాపం చేశాడని విమర్శించాడు. షరియా దృష్టిలో షమీ నేరస్థుడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వెంటనే క్షమపణలు కోరుకోవాలన్నాడు. కాగా ఇదే విషయంపై మరో మౌలానా ఖలీద్ రషీద్ మాట్లాడుతూ.. షమీ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నందున ఇస్లాం మతానికి విరుద్ధం ఏం కాదన్నారు. ఆరోపిస్తున్న విషయాలన్నీ పూర్తిగా తప్పు అని అన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఉపవాసం ఉండాలని ఇస్లాంలో చెప్పలేదని అన్నారు. షమీ ఫైనల్ మ్యాచ్ లో భారత తరఫున మరింత మంచి ప్రతిభను కనబరిచి భారత్ ను గెలిపించాలని ఆకాంక్షించారు.